యాపిల్ సంస్థ ఏటా కొత్త సిరీస్ ఐఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టాప్ రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఐఫోన్ 14ను మించిన సరికొత్త సిరీస్‌లో ఉంటాయని టెక్ రిపోర్ట్స్ తెలిపింది. ఈ సిరీస్‌లోని ఐఫోన్ 15 ప్రో మోడల్స్, అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కెపాసిటీతో మార్కెట్ లోకి రానున్నట్లు తాజాగా లీక్స్ చెబుతున్నాయి.