విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్‌ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్‌లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి…