కాంగ్రెస్ నేత, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని వినేష్ ఫోగట్‌కు సూచించారు. అనర్హతకు గురైనందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాల్ఘర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంతో మీ మనసులు గాయపడ్డాయని తనకు తెలుసన్నారు.
అసెంబ్లీ సమావేశాలు గానీ.. పార్లమెంట్ సమావేశాలు గానీ ఎలా జరుగుతాయో ప్రజలందరికీ తెలిసిందే. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఐదేళ్లకోసారి అటు వైపు వాళ్లు.. ఇటు వైపు... ఇటు వైపు వాళ్లు.. అటు వైపు వెళ్లడం జరగుతుంటుంది.