కృష్ణా జిల్లా చిన్న గొన్నూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. అనంతరం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది. అత్యుత్సాహం కొద్ది ఏదో చేద్దామని చెప్పి తనను చంపాలని చూశారని ఆయన అన్నారు. దీని కోసం రెక్కీ కూడా నిర్వహించారన్నారు. వారు ఎవ్వరో త్వరలో తెలుస్తుందన్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. ఎవ్వరు ఏ…
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల…
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్లైన్లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో…
విశాఖపట్నంలో ఇవాళ పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 30ఏళ్ళు వెనక్కుపోయిందని నిప్పులు చెరిగారు. బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో తలా తోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక తన ప్రమేయం లేదన్నారు ఎంపీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,801 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 94 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 31128369 కు చేరింది.. మొత్తం పాజిటివ్…
ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒమిక్రాన్ కేసులపై ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.కేంద్రం డిసెంబర్ మొదటి తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ర్టంలో 99శాతం మందికి మొదటి డోసు వేయడం పూర్తయిందని వెల్లడించారు. మేము నవంబర్ చివరి వారం నుంచే ప్రయాణికులను ట్రేస్ చేయటం ప్రారంభించడంతో కేసులు పెరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు. 72 శాతం…
కరోనా సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఆనందయ్య పసరు మందుకు జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అప్పట్లో దీనిపై అయిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనాలను కంట్రోల్ చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనందయ్య మందును శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడం లేదంటూ మందు పంపిణీ నిలిపి వేయాలని…
ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే…
వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25వరకు మూడు రోజుల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరు , పులివెందులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మొదటి రోజు జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..(23.12.2021)ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు.12.00 –…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,670 శాంపిల్స్ పరీక్షించగా.. 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 175 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,67,410…