ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లెక్కల ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,95, 136 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 7 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య…
నిజాయితీకి, పరిపాలనా దక్షతకు దామోదరం సంజీవయ్య నిదర్శనం అన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లక్డీ కాపూల్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హనుమంతరావు సంజీవయ్యను గుర్తుచేశారు. ఈనాడు ఎంతోమంది డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు ..సేవ చెయ్యడానికి రావాలన్నారు. నీతి నిజాయితీకి కలిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. రెండు ప్రభుత్వాలు శత…
గుడివాడ కేసినో వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఛీర్ గాళ్స్ ఇండిగో విమానంలో వచ్చారని, ఉత్తరాది మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. గుడివాడలో ఇటీవల కేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఈ కేసినోలో చీర్ గాళ్స్ కూడా ఉన్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. కేసినోలో పాల్గొన్న చీర్ గాళ్స్ ప్రయాణ వివరాలను ఆయన…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80, 634 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో…
ఏపీలో పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలాలేదు. పలుమార్లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఉద్యోగులకు, ప్రభుత్వానికి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలని ఏపీ ఏన్జీవో నేత విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమైన పలు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల…
సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సేవకులు కనుమరుగు అవుతున్నారన్నారు. ప్రజాధనం లూటీ చేసే వాళ్లే రాజ్యం ఏలుతున్నారన్నారు. వామపక్షాలు బలహీన పడ్డాయి..అందుకే దేశంలో అరాచకం పెరిగిందని చాడా వ్యాఖ్యానించారు. సీపీఐ, సీపీఎం భావసారుప్యత ఉన్న పార్టీలని చాడ అన్నారు. వామపక్షాల ఐక్యతే కాదు..…
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
తిరులమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో ఇక నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండవని పేర్కొంది. పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులును దర్శనానికి అనుమతించిన టీటీడీ. పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3 లక్షల 77వేల 943 మంది భక్తులు. 1,22,799 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పది…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. Read Also: ఒళ్లు…