ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం అని తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం…
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ…