చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
జగన్ అసమర్ధ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో సారి సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్..? అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి బొత్సకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య తెలుసా..? అంటూ ఆయన విమర్శించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై విద్యార్దులకు సమాధానం…
ఏపీలో ఓటీఎస్‌ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…