కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ రిజిస్ట్రేషన్లల్లో కోల్పోతున్న ఆదాయంపై ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని గుర్తించిన ప్రభుత్వం… హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా…