ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లిందని..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా?…