తిరుమల తిరుపతి దేవస్థానం అగర్‌బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్‌బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం…