నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. జాతీయ రహదారులపై కేంద్ర మంత్రిత్వ సమీక్ష జరిపాం అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులకు ఉన్న భూ సేకరణ సహా అడ్డంకులపై చర్చించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, రహదారులకు ఉన్న అడ్డంకులు, సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం అని వివరించారు.. అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ CRF కింద మరింత అదనపు నిధులు ఇస్తామన్నారని వెల్లడించారు..