ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…