Chinta Mohan: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీ కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రోజు రోజుకు ప్రధాని…
Yanamala: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి కొత్త రక్తం రావాలని.. దానిపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్ క్రిమినల్ కాబట్టి.. ఆయన్ను కలవడానికి ఎవరైనా భయపడతారని.. చంద్రబాబు, పవన్ కలవాలి అంటే జగన్ అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ భేటీతో తాము ఓడిపోతామనే భావనలోకి సీఎం జగన్ వెళ్లారని చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్…
Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన తండ్రి టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలవడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె పెళ్లికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లలేకపోయారని.. పెళ్లికి వెళ్లలేదు కాబట్టే కర్టసీగా కేశినేని నానిని పలకరించడానికి వెళ్లారని తెలిపారు. కేశినేని నానితో తన తండ్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మరోవైపు తన…
Vijayawada: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని…
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలిసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని…
Telugu Desam Party: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీనోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్ర…
Sajjala: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని.. జగన్ పూర్తి కాలం పాలిస్తారని…
Ram Gopal Varma: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కేవలం డబ్బులు కోసం పవన్ తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని అస్సలు ఊహించలేదని వర్మ అన్నాడు. దీంతో ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్ చేశాడు. అయితే వర్మ ట్వీట్‌పై జనసేన…
YSRCP: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్…