Karumuri Nageswara Rao: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది.
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.
అవినీతిపై బహిరంగ చర్చలో విజయం తనదే అని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి తప్ప.. అవినీతి లేదన్నారు. చర్చకు వస్తానని చెప్పి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోక ముడిచారని సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే…
Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.…
Anaparthy MLA Sathi Suryanarayana Reddy Comments: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మరోసారి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో అక్కడి రాజకీయం వేడిక్కింది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సవాల్‌ను ఎమ్మెల్యే స్వీకరించారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల…
Sathi Suryanarayana Reddy vs Nallimilli Rama Krishna Reddy: ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి…