Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులతో పోలిస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే దాదాపు అదే స్థాయి అప్పులు చేసిందని ఆరోపించారు. జగన్ హయాంలో మొత్తం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో 18 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్ల అప్పులు…
బాగా నోరున్న మా పార్టీ నేతల్లో అంబటి రాంబాబు తొలి వరుసలో ఉంటారని చమత్కరిస్తుంటారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే బయట కూడా ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా.. తర్వాత అందరికంటే ముందు సర్కార్ మీద వాయిస్ రెయిజ్ చేశారు అంబటి.