ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. కాగా.. మద్యం షాపుల దరఖాస్తులు 50 వేలు దాటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం వచ్చిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి.. నిన్నటితో వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి అయ్యింది.. అయితే, మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. కానీ, పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి.. ఇవాళ నుంచి విధుల్లోకి రాలేదు సిబ్బంది..
ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. ఇక వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. ఇక, దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు..
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు.
అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలుపరుస్తాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో మైనింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించింది.. మద్యం పాలసీ సైతం భ్రష్టు పట్టిందని ఫైర్…