ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు…
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్‌లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు…
ఎనిమిది కార్పొరేషన్ చైర్ పర్సన్ కార్యాలయాలు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 200 పైగా కార్పొరేషన్ చైర్మన్లు, 2000 పైగా డైరెక్టర్లు ఏర్పాటు చేశామని, తొంభై శాతం పైగా మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు. ఎలక్షన్ల ముందు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు గతంలో.. కానీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. సమాజంలో అదరణకు నోచుకోని వారందరికి సీఎం జగన్ సామాజిక, రాజకీయ, ఆర్ధిక గుర్తింపు తెచ్చారని…
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల (New Districts) నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రేపో, ఎల్లుండో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షంచనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల…
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్‌తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లోకొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాని NDMA,మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం, మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిందన్నారు. మెరుగైన పరిపాలన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల…
ఏపీ ప్రభుత్వం ఇటీవల 13 కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్…
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబుతోన్నాయి.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.. ఇక, విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లాగా రికార్డుకెక్కిన అనంతపురం ఇక మీదట రెండు జిల్లాలు కానుంది.. అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు కాబోతోంది.. అనంతపురం జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి,…