AP New Districts: తుదిదశకు చేరిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి.
స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవంటున్నారు అధికారులు. బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది ప్రభుత్వం. బాలాజీ జిల్లాగా కాకుండా కొత్త జిల్లాను తిరుపతి పేరుతోనే ఏర్పాటు చేస్తూ నోటిఫికేషనులో సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం వుంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ ఎలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!