ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ…