టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ అని చెప్పారు. రైతుల కోసం అనేక ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా మిగులు నిల్వలతో రైతుల కోసం ఆలోచిస్తున్న…
ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల విప్లవం రాబోతోందన్నారు వ్యవసాయమంత్రి కన్నబాబు. అర్భీకేలు బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నాయి. ఎఫ్ఏఓ, ఐసిఏఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అర్భీకేలకు గుర్తింపు లభించిందన్నారు మంత్రి. త్వరలోనే ఆర్గానిక్ పాలసీ తీసుకొని రాబోతున్నాం. అర్భీకేల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడ ఇబ్బందులు లేవు. వర్షాలు వరదల వల్ల ధాన్యం రంగు మారింది. రైతులను అన్ని విధాలుగా…