ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ కోసం క్షీరసాగర మదనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన కామెంట్లను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. దీంతో ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషనుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌంటర్ ఇచ్చింది. సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలుకు ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాల…