AP High Court: అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి, ఎలా చేయాలి…