AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది…
ఏపీ ఉద్యోగులు పిలుపునిచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలు పడ్డాయని.. వాళ్ల సమస్యలపై ఆందోళనలకు దిగే బదులు ప్రభుత్వం చర్చలకు రావొచ్చని సజ్జల సూచించారు. ఉద్యోగుల కార్యాచరణను ఇప్పటికే వాయిదా వేసుకోవాలని కోరామని.. ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రేపు విజయవాడలో ఉద్యోగులు చేసేది ముమ్మాటికీ బలప్రదర్శనే అని…