Andhra Pradesh: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి…