కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది.
కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? తమకే సీటు కేటాయించాలంటూ స్థానికల నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో.. అసలు టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ.. అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసింది జనసేన అధిష్టానం..
ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న…