ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్.
వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కల్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్‌కి, నాన్‌లోకల్‌కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.