త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే.. ప్రజలకు అండగా ఉండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు.
వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్
గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలుగుదేశం పార్టీ.. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దని కోరుతూ.. అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా.. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. దీనిపై నేడు…