హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈమేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు , అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.