High Court Judgement: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు (శుక్రవారం) కీలక విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరు నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించి తీరాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్ జెండర్ల కోసం ఎటువంటి పోస్టులను…
STU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) అధ్యక్షుడు, FAPTO చైర్మన్ సాయి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు ఇకపై బోధనేతర (Non-Teaching) పనుల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ మినహా మిగిలిన అన్ని యాప్‌లను బహిష్కరించాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర విద్యాశాఖ…
భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్! భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్‌తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్‌కు…
డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్…
DSC Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించింది. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని ప్రకటించింది. Komatireddy Venkat Reddy : కేసీఆర్ పై…
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..టెట్, డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..