AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?
- 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు
- ఎస్జీటీలు పోస్టులు 6371
- పీఈటీ పోటస్లు 132
- స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7725
- టీజీటీ పోస్టులు 1781
- పీజీటీ పోస్టులు 286
- ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టిసారించారు.. అందులో భాగంగా వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం.. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మెగా డీఎస్సీ కీలకంగా మారింది.. ఒకే సారి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్..
Read Also: Jammu-Kashmir Terror Attack :’పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించండి’.. మోడీ సూచన
Also Read
ఇక, సీఎం చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయగా.. ఆ మెగా డీఎస్సీ ద్వారా ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్న విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వం.. 16,347 పోస్టుల మెగా డీఎస్సీ ద్వారా.. ఎస్జీటీలు పోస్టులు 6,371.. పీఈటీ పోటస్లు 132, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపాల్స్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. కాగా, ఈ ఏడాది ఆదిలోనే వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవటంతో కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీంతో డీఎస్సీ షెడ్యూల్ వాయిదా పడింది. వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించారు.. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించింది. వీటికి సంబందించి ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. డీఎస్సీతో పాటు టెట్ ఫలితాల విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఇక, మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన నేపథ్యంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!