నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పార్టీ నేతలతో కీలక భేటీ నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. అక్కడ తొలుత తోట సీతారామలక్ష్మీతో ఆయన సమావేశం కానున్నారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా పవన్ కలవనున్నారు. వీరిద్దరితో మర్యాదపూర్వకంగానే జనసేనాని భేటీ…
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. దీనిపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని స్పష్టం చేశారు.. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.డిఎస్‌సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు..అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ గారు ప్రకటించారు..కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయింది.గడిచిన ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు.డి.ఎడ్, బి.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ…