జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనే సెమినార్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు.. తమిళనాడు సిద్ధుల భూమి. తమిళ దేవుడు మురుగన్ భూమి.. నేను తమిళనాడులో నివసించాను.. నేను చెన్నైలో పెరిగాను.. నేను తమిళనాడు వదిలి వెళ్ళిపోయినా, తమిళనాడు నన్ను వదిలి వెళ్ళలేదు అని అన్నారు. Also Read:Kakani…
మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇద్దరూ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి... అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు దిల్ రాజు. దానితో పాటుగా దిల్ రాజు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ ముఖ్య…
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో…
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మావయ్య పవన్ అంటే సాయికి ఎంతో ప్రేమ. ఇటీవల మావయ్య దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ…