ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1, 2022 నుంచి పెన్షన్ రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్.జగన్ సర్కార్ కానుక అందించింది. పెన్షన్‌ను రూ.2500కు పెంచి ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో రూ.2500 పెన్షన్ మొత్తాన్ని పెట్టనుంది వైయస్.జగన్ సర్కార్. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్. డిసెంబర్, జనవరిల్లో కార్యక్రమాలను జగన్ వివరించారు. స్పందన వీసీలో…
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని… క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా.. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని… గ్రామ, వార్డు సచివాలయాల్లోనే…
తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్‌తో ఆర్డినెన్స్‌కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..! టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.…
తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ట్వీట్ల వార్ ప్రారంభించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”ప్రతిపాదన తేవడం…కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…!అంటూ రేవంత్ రెడ్డి ఘాటైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఈ…