ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.
కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంచింది సర్కారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వన
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాస�
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని.. 11 మందికి సీట్లు మార్చేశారని ఆయన అన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఊహించలేదని.. ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఆయన ప్రశ్నించారు. దళితులు, బీసీలనే బదిలీ చేశారని
మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని ని�
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. �
తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.