టెంకాయలు కొట్టి… హారతులిచ్చి… మందుబాబుల సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మందుబాబుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జగన్ ప్రభుత్వం శనివారం శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేయడంతో ధరలు తగ్గనున్నాయి. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించటంతో ఆనందంలో మందు బాబులు చిందులేశారు. మద్యం షాపులకు వచ్చి.. హారతులు ఇచ్చి.. కొబ్బరికాయలు కొట్టి పాటలు పాడుతూ ప్రత్యేక పూజలు చేశారు మందు బాబులు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యం ధరలు తగ్గించటమే తమ ఆనందానికి కారణమంటున్నారు. మందు రేట్లు తగ్గిన సందర్భంలో సంబరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హారతి కర్పూరం వెలిగించి దిష్టి తీసి మరీ మందుబాబులు ఆనందం వ్యక్తం చేయడంతో మందు షాపులు కళకళలాడుతున్నాయి.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!