దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్‌కిలోని లీ మెరిడియన్ హోటల్‌లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో…