కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను…
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఏంటో చూద్దాం. ఎస్‌ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా…
న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..! అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం..
ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు.. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.