ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుందని, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయని, వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. Also…
రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు…
రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌లో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు. Also Read:…
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది... ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చిస్తారు... వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.. ఎస్ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు…
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే.. గణాంకాలు ఇవే!…
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా... ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు..
ఎన్డీఏ కూటమి వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సాయాన్ని పది వేల నుంచి 20 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ మత్స్యకారులకు శుభవార్త చెప్పారు మంత్రి నిమ్మల.. ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు రూ.20 వేల చొప్పు సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు..