AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది… ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చిస్తారు… వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.. ఎస్‌ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది.. వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఈ సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు సంబంధించి జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ.. సభలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. దీనికి సంబంధించి కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.. అదేవిధంగా వచ్చే నెల 12న ఒక భారీ స్థాయిలో సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
Read Also: Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..
ఇక, ఉద్యోగుల బదిలీలు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా కేబనిఎట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించిన పలు ప్రాజెక్టులకు.. కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం వీటికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.. కేబినెట్ సమావేశం తరువాత తాజా రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం ఉంది.. లిక్కర్ అరెస్టులకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ తర్వాత చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది.. తాజా రాజకీయ పరిణామాలు.. మహానాడులో చర్చించే ప్రభుత్వ సంక్షేమం కార్యాచరణ ఎజెండా.. ఏడాది పాలనలో మంత్రుల పాత్ర.. ఇవన్నీ చర్చించే అవకాశం ఉంది.