ఆంధ్రా ఒడిశా సరిహద్దులో.. శ్రీకాకుళం జిల్లాలోని మాణిక్యపట్నం గ్రామంలో తరచుగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు.. అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు.. ఆంధ్రాలోనే ఉంటామని చెబుతున్నా.. మాణిక్యపట్నంపై ఒడిశా అధికారులు పట్టు పెంచుకోవాలని చూడడం.. అది తమ రాష్ర పరిధిలోని గ్రామమే అని వాదిస్తుండడం.. పదే పదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. స్థానికులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ మధ్య.. అతి చొరవ తీసుకుని మాణిక్యపట్నం గ్రామ తహసీల్దార్ కార్యాలయానికి సీల్ వేసి..…