గృహహింస కేసులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.…