విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. పురంధేశ్వరికి సోము వీర్రాజు బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.