YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు.
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నాను గనుక మాట్లాడకూడదు అంటే కుదరదంటున్నారు. గత ఐదేళ్లు కార్య కర్తలను ఇబ్బంది పెట్టినవాళ్లను కూటమి పార్టీలు చేర్చుకోవద్దని హితవు పలికారు.. ఇక, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, యువత ఎదుర్కోంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా వున్నాయని అన్నారు. గంజాయి కేసుల కోసం అయితే తన ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దని స్పష్టం చేశారు.. ఇక, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో…
అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్నారు.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయ్యిందన్నారు..
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్‌ను పలకరించారు.. పవన్ కల్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి…
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా... పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో... ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది.
రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు
ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు.