ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారి అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించామని అన్నారు. ఉపాధి లేక పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేవారు అని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించామని తెలిపారు. నల్గొండకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చామన్నారు. నదుల అనుసంధానంతో సాగుకు ఊతమని వాజ్‌పేయీకి సూచించానని తెలిపారు.
Also Read:ఎద అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న విధి యాదవ్ !
అప్పుడు టాస్క్‌ఫోర్స్ వేసినా అనంతర పరిణామాలతో ముందుకు సాగలేదన్నారు. నదుల అనుసంధానం చేయాలని ప్రధాని మోదీకి సూచించానని తెలిపారు. నదుల అనుసంధానానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధంగా లేవని మోదీ చెప్పారన్నారు. చొరవ చూపిన రాష్ట్రాలు ముందుకెళ్లాలని మోదీ సూచించారని తెలిపారు. సరైన సమయంలో గంగా, కావేరి అనుసంధానం చేపడతామన్నారు. నదుల అనుసంధానం బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 2020 కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం చెడ గొట్టిందన్నారు. ఇది నా పూర్వ జన్మసుకృతం.. మొత్తం 40 నదులు, 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. నదులు అనుసంధానించి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.
Also Read:TGSRTC: బస్సు ఛార్జీల పెంపు వెనుక అసలు విషయం చెప్పిన ఆర్టీసీ
2014-19 కాలంలో నీటిపారుదలకు రూ.68,417 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైసీపీ పాలనలో రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది నీటిపారుదలకు రూ.12,454 కోట్లు ఖర్చు చేశాం. ఐదేళ్లలో నీటిపారుదలకు రూ.70 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడతామన్నారు. మేజర్, మీడియం రిజర్వాయర్లలో 94 శాతం నీళ్లు వచ్చాయన్నారు. ఏ పని చేసినా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి చేస్తుంది. మాకు నీళ్లు కావాలి అని ప్రకాశం జిల్లా వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగారు. వెలిగొండ కు నీళ్లు ఇచ్చామని వైసిపి అబద్ధాలు చెప్పింది. 2059 కోట్ల ఖర్చు తో వచ్చే జులై కు ప్రకాశం లో కనిగిరి..మార్కాపురం.. ఎర్రగొండపాలెం..కు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలం లో ప్రాజెక్ట్ లకు గ్రీజ్ కూడా పెట్టలేదు.. శ్రీశైలం ప్రాజెక్టు కు 204 కోట్ల తో టెండర్ల కు ఆహ్వానం.. వైసిపి పార్టీ కి సాగునీటి పై సరి అయిన విధానం లేదని సెటైర్లు వేసిన ముఖ్యమంత్రి… అసెంబ్లీ హాలులో గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టు ల పై మాజీ ముఖ్యమంత్రి తోపాటు, మంత్రులు మాట్లాడిన వీడియోలను అసెంబ్లీలో ప్రదర్శించిన ముఖ్యమంత్రి… కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు… సంకల్పబలం గట్టిగా ఉంది కాబట్టి పులివెందులకు సైతం నీటిని ఇచ్చాం…
అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 903 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, NGT ఆ ప్రాజెక్ట్ ను నిలిపి వేసింది… ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేస్తాము… కరువు జిల్లా గా ఉన్న ప్రకాశం జిల్లా కు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందించేందుకు 1996 వ సంవత్సరం లో పునాది వేశాను.. 4306 కోట్ల ఖర్చు చేసాము,మరొక 2059 కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది… కానీ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే గత ప్రభుత్వం హడావుడి గా ప్రారంభించింది.. ప్రకాశం పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం చేసేందుకు వచ్చే ఏడాది జులై వరకు పూర్తి చేస్తామన్నారు.