విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచదని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడగడం…
వైసీపీ పాలనలో కాలువలు, డ్రెయిన్స్‌లో తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి.. గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని, ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.380 కోట్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్నా..…
ఏపీ శాసనసభలో సభ్యులకు సీట్లను కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సూచనల మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ విషయంలో ఏదైనా సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం, వైసీపీ శాసనసభా పక్షనేత వైఎస్…