ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష…