ఎర్ర శేఖర్. టీడీపీ నుంచి బీజేపీలోకి అటు నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే. కొన్నాళ్లుగా ఎర్ర శేఖర్ చేరికపై పార్టీలో చర్చ జరుగుతున్నా.. ఈ మధ్య ఆటంకాలు అధిగమించి.. పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఇప్పటికే మాజీ ఎంపీ మల్లు రవి.. యువ నేత అనిరుధ్‌రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ రాజకీయాలను రక్తికట్టిస్తుంటే.. ఇప్పుడు కొత్తగ ఎర్ర శేఖర్ ఎంట్రీతో రాజకీయం ఇంకా రసవత్తరంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో ప్రమాదకరంగా మారిన నాయకులకు కనువిప్పు కలిగించాలని, లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కాంగ్రెస్ కోరుకొంటోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజానికి హానీ కలిగించే వ్యక్తులను అమ్మవారు శిక్షిస్తుందని రేవంత్ అన్నారు. ప్రజలు మనుషుల వల్ల కానీ పనులను అమ్మవారు చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే.. క్రూరమైన ఆలోచనలతో పాలిస్తున్న వారికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం చేసారు పోలీసులు. దీనిపై స్పందించి రేవంత్ రెడ్డి సీఎం పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే నిర్భంధించారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శ్రేణులను నిర్భంధిస్తే తప్ప తెలంగాణ సీఎం ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారని విమర్శించారు. దీనికి నిదర్శనమే ఉమ్మడి ఖమ్మం జిల్లా…
నేడు చంచల్ గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్ అవనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు…