తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం చేసారు పోలీసులు. దీనిపై స్పందించి రేవంత్ రెడ్డి సీఎం పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే నిర్భంధించారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శ్రేణులను నిర్భంధిస్తే తప్ప తెలంగాణ సీఎం ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారని విమర్శించారు. దీనికి నిదర్శనమే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల గృహ నిర్బంధం.. అరెస్టులే అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల ఇలా నిర్భంధించడంపై ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ రేవంట్ రెడ్డి ట్వీట్ చేశారు.
అయితే.. భారీ వర్షాల నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు స్థానిక కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు.
ప్రజా సమస్యల పై ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులను నిర్భందిస్తే తప్ప ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుండి కాలు బయటపెట్టలేక పోతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల గృహ నిర్భందం, అరెస్టులే దీనికి నిదర్శనం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) July 17, 2022