టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో ప్రమాదకరంగా మారిన నాయకులకు కనువిప్పు కలిగించాలని, లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కాంగ్రెస్ కోరుకొంటోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజానికి హానీ కలిగించే వ్యక్తులను అమ్మవారు శిక్షిస్తుందని రేవంత్ అన్నారు. ప్రజలు మనుషుల వల్ల కానీ పనులను అమ్మవారు చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే.. క్రూరమైన ఆలోచనలతో పాలిస్తున్న వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని చల్లని చూపులతో కాపాడాలని కోరుకున్నట్లు, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే విధంగా చూడాలని తెలిపారు. అంతేకాకుండా.. మానవ తప్పిదాల నుంచి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. అయితే.. ఒక వేళ వారు మారకపోతే వాళ్లను మార్చి.. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు.
ఈనేపథ్యంలో.. ఉజ్జయిని అమ్మవారి ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా.. మహంకాళి టెంపుల్ వద్ద పోలీసులు, రేవంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ తో పాటు వచ్చిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటూ మండిపడ్డారు. బారికేడ్లను తోసుకుని రేవంత్, అంజన్ కుమార్ ముందుకెళ్లారు. దీంతో ఆలయం వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థతి నెలకొంది.
Pawan Kalyan Live: భీమవరంలో జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం