నేడు చంచల్ గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్ అవనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని పిలపునిచ్చారు.
అయితే.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కొందరు అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ ఒకటి దగ్ధమైంది. అలాగే అద్దాలు పగిలిపోవడం, ఇతరత్రా విధ్వసం జరిగింది. దీనికి కారకులైనవారందరినీ గుర్తించి అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తమ పిల్లలకు హైదరాబాద్ రావాలని ఫోన్ వస్తే వచ్చారని, వారికి, ఈ విధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదని జైలులో ఉన్న అభ్యర్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mexico Firing: పోలీసులు, సాయుధులకు మధ్య కాల్పులు.. 12 మంది మృతి